తాజా వార్తలు

Thursday, 12 May 2016

ఢిల్లీ వెళ్లిన గవర్నర్… కేంద్ర మంత్రులతో భేటీ…

రెండు రోజుల పర్యటన కోసం గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఈరోజు,రేపు ఢిల్లీలో ఉండనున్న గవర్నర్‌ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రులతో భేటీ అవుతారు. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న కరవు, ఇతర పరిస్థితులు, ఉద్యోగులు, తొమ్మిదో, పదో షెడ్యూలు సంస్థల విభజన తదితర అంశాలపై ఆయన నివేదిక సమర్పించనున్నారని సమాచారం. అలాగే నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల అంశంపైనా ఆయన మంత్రులకు వివరించే అవకాశం ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment