తాజా వార్తలు

Monday, 23 May 2016

ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న శాతకర్ణి…

బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల మొరాకాలో ప్రారంభమైన ఈ షెడ్యూల్ లో హీరో బాలకృష్ణ, విలన్ కరణ్ బేడీ ల మధ్య భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాలకు రామ్ లక్ష్మణ్ దర్శకత్వం వహించారు.
దాదాపు 1000 మంది ఆర్టిస్టులు ఈ యుద్ధ సన్నివేశాలలో పాలు పంచుకోగా రెండు వందల గుర్రాలు, ఒంటెలు ఇందులో పాల్గొన్నాయి. షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంపై దర్శకుడు క్రిష్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అనుకున్న ప్రకారం సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందని, ఈ వయసులో కూడా బాలకృష్ణ ఎనర్జీ అందరికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఈ సినిమాకు వై. రాజీవ్ రెడ్డి, జాగర్ల మూడి సాయిబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.., దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment