తాజా వార్తలు

Thursday, 26 May 2016

నోటికాడి కూడు ఎత్తగొట్టే కుట్రలు

మల్లన్నసాగర్ నిర్మాణానికి అడ్డుతగులుతూ... నోటికాడి బుక్క ఎత్తగొట్టడానికి కుట్రలు పన్నుతున్న ప్రతిపక్షాలను గ్రామాల్లోకి రానివ్వొద్దని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశా రు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు నీటిపారుదల మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు.

ఆయన మంత్రిగా పని చేసిన కాలంలో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి 3,073 ఎకరాలను సేకరించి రైతులకు ఎకరాకు కేవలం రూ.లక్షా 39 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఐనాపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మా ణంలో ఎకరాకు కేవలం రూ. 80 వేలు మాత్రమే చెల్లించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.20 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాము ఎకరాకు రూ. 5.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంటే కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment