తాజా వార్తలు

Sunday, 8 May 2016

కదిరిలో వైఎస్ జగన్‌కు అభిమాన స్వాగతం

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి పులివెందులకు వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరారు.

కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్‌లో ఆయన కాన్వాయ్‌ను చూసిన అభిమానులు అభివాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. దీంతో వాహనం నుంచి కిందకు దిగిన వైఎస్ జగన్ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కదిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరడం వల్ల పార్టీకి స్థానికంగా వచ్చిన నష్టం ఏమీ లేదంటూ వారు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment