తాజా వార్తలు

Thursday, 5 May 2016

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన…

మొన్నటి చాలామంది ప్రాణాలతో ఆటలాడిన సూర్యుడు నెమ్మదిగా తన ప్రతాపాన్ని తగ్గించాడు. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత‌లు త‌గ్గాయి. భానుడి ప్రతాపాన్ని తగ్గించడానికి వరణుడు కరిణించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలుల‌తో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మ‌రో మూడు రోజులు కొన‌సాగుతాయ‌ని, భారీ వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చని వాతావ‌ర‌ణ కేంద్ర అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణ‌లో ఉరుములతో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నట్లు తెలిపారు. అలాడే ప‌లు జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన‌ వర్షాలు కొన‌సాగుతాయ‌ని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment