తాజా వార్తలు

Sunday, 29 May 2016

కర్నూల్, అనంతపురం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం…

కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లాల్లోని ఉరవకొండ, పత్తికొండ, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆలూరు, ఆస్పరి, ఆళహరి, మంత్రాలయం మండలాల్లో భారీగా వర్షం కురుస్తుంది.
కర్నూలు బురుజుల, చిన్నహుల్తీ వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. మంత్రాలయంలో గోశాల మునిగి రెండు దూడలు చనిపోయాయి. ఇక ఆదోని-పత్తికొండ, పత్తికొండ-గుంతకల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురంలో దోనేకల్లు వద్ద జాతీయ రహదారిపై నీరు చేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండు జిల్లాల్లో భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకురాయి. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment