తాజా వార్తలు

Wednesday, 18 May 2016

టాలీవుడ్ హీరో తండ్రి కన్నుమూత

వర్ధమాన సినీ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం వేకువజామున కన్నుమూశారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వర్ధన్ 6వ అంతస్తు నుంచి మంగళవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నేటి వేకువజామున ఆయన మృతిచెందారు.

ప్రమాదవశాత్తూ వర్ధన్ మృతిచెందడంతో తనీష్, ఆయన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో ఉన్నారు. దేవుళ్లు, మన్మధుడు సినిమాలలో బాలనటుడిగా నటించిన తనీష్ నచ్చావులే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచమమైన విషయం తెలిసిందే. వర్ధన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆయన ప్రమాదవశాత్తూ జారి పడలేదని ఆత్మహత్యాయత్నం చేశారని భిన్న కథనాలు వినిసిస్తుండగా, బాల్కనీ నుంచి పడిపోవడంతోనే చనిపోయారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment