తాజా వార్తలు

Monday, 2 May 2016

ప్రియాంక సంచలన నిర్ణయం…

బాలీవుడ్‌ లో ఎన్ని సినిమాలలో నటించినా అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’తో హాలివుడ్ లో పాగావేసి తన ఫాలోవర్స్ ను అమాంతం పెంచేసుకుంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అయితే అంతలా పేరు తెచ్చిన ‘క్వాంటికో’ సిరీస్ తరువాత మరే టీవీ సిరీస్‌కి ఒప్పుకోనని చెప్పేసింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.., “హిందీ చిత్రాలను ఏ మాత్రం వదులుకోనని అయితే ఇప్పుడప్పుడే మాత్రం ఏ చిత్రాలు అంగీకరించనని చెప్తూ దానికి కారణం కూడా చెప్పింది. ఇప్పటివరకు తీరిక లేకుండా పనిచేశానని, త్వరలో భారత్‌ వచ్చి ఓ రెండు నెలల పాటు కుటుంబంతో గడిపి, ఆ తర్వాత మిగతా క్వాంటికో షూటింగ్‌ కోసం మళ్లీ అమెరికా వెళ్తానని చెప్పింది. ఆ తరువాత మాత్రం ఆఫర్లు వచ్చినా ఏ టీవీ సిరీస్ లో నటించనని ఖరాఖండిగా చెప్పేసింది” ఈ మాజీ మిస్ యూనివర్స్. ఉన్నట్లుండి ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణమేంటో మరి…?
« PREV
NEXT »

No comments

Post a Comment