తాజా వార్తలు

Friday, 27 May 2016

భారతీయ ఐటీ కంపెనీలకు మరో షాక్!

భారతీయ ఐటీ కంపెనీలకు యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ కొత్త షాక్ ను ఇచ్చింది. ఐటీ కంపెనీలో పని చేయడానికి అమెరికాకు వెళ్లే ప్రతి ఉద్యోగికి అవసరమైన హెచ్-1బీ వీసాకు అదనంగా 4 వేల డాలర్లు (2,68,181 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే ఎల్-1 బీ వీసా కోసమైతే 4.5వేల డాలర్లు (3,01704 రూపాయలు) చెల్లించాలని వివరించింది. వీసాలకు ఈ ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది.

దీంతో భారతీయ ఐటీ కంపెనీలపై 400 మిలియన్ డాలర్ల పెనుభారం పడనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నదని కంపెనీలు విమర్శించాయి. మరో వైపు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై అమెరికా పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇందుకు సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. 50 మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే ఏ భారతీయ కంపెనీ అయినా హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ఈ నిబంధనలను వర్తిస్తాయని పోస్టులో వివరించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment