తాజా వార్తలు

Thursday, 26 May 2016

15ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తున్నారు

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సీనియర్ హీరో జగపతి బాబు పదిహేనేళ్ల తరువాత కలిసి పనిచేస్తున్నారు. పూరి దర్శకుడిగా పరిచయం అయిన కొత్తలో జగపతిబాబు హీరోగా బాచీ అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావటంతో వచ్చిన సంగతే ఎవరికీ గుర్తులేదు. ఆ తరువాత జగపతిబాబు హీరోగా రిటైరయి ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ ఫాంలో ఉన్నాడు.

పూరి కూడా స్టార్ డైరెక్టర్ గా మంచి రేంజ్ లో ఉన్నాడు. అందుకే ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ కాంబినేషన్ వెండితెర మీద కనిపించనుంది. కళ్యాణ్ రామ్ హీరోగా పూరి తెరకెక్కిస్తున్న సినిమాలో జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నాడు. టెంపర్ సినిమా సమయంలో పోసాని కృష్ణమురళి చేసిన పాత్ర తనకు ఎంతో ఇష్టమని అలాంటి పాత్ర చేస్తానని ప్రకటించటంతో, జగ్గుభాయ్ కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు పూరి.

« PREV
NEXT »

No comments

Post a Comment