తాజా వార్తలు

Friday, 6 May 2016

విదేశాల షెడ్యూల్ లో జక్కన్న…

సునీల్ హీరోగా, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జక్కన్న’ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ప్రస్తుతం ఇక్కడే షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ ను విదేశాల్లో ఫ్లాన్ చేశారు. ఈ నెల 11న ఫారిన్ కు వెళ్లనున్న చిత్ర యూనిట్ అక్కడ మూడు పాటలను చిత్రీకరించుకుని తిరిగి ఇండియాకు రానుంది.
ఇప్పటికే టాకీని పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన షూటింగ్ ను మే నెలాఖరు లోగా పూర్తి చేసుకోనుంది. ఆ తరువాత ఆడియో వేడుకను నిర్వహించి, జూన్ 3వ వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సునీల్ సరసన హీరోయిన్ గా మన్నోరా చోప్రా నటిస్తోంది. ఆర్. సుదర్శన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment