తాజా వార్తలు

Monday, 16 May 2016

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది…

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 19న సాయంత్రం 6గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే నేపధ్యంలో ఈ ఫస్ట్ లుక్ ను అభిమానులకు కానుకగా ఇవ్వనున్నాడు ఎన్టీఆర్.
మరోవైపు ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలని దీని మీద కసరత్తులు చేస్తున్నారు చిత్ర యూనిట్. వరుస సక్సెస్ లతో ఉన్న ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన నిత్యా మీనన్, సమంత నటిస్తుండగా, మోహన్ లాల్, సాయి కుమార్, ఉన్ని ముకుందన్, సుహాసిని తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment