తాజా వార్తలు

Friday, 6 May 2016

సుప్రీం నిర్ణయంతో వెనక్కి తగ్గిన కేంద్రం…

ఉత్తరాఖండ్ లో రాజకీయ అస్థిరతను ఆసరా చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్ధతుగా తీర్పును ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై విచారించిన ఉన్నతన్యాయస్థానం కేంద్రానికి మొట్టికాయ వేసింది. ఉత్తరాఖండ్ లో బల పరీక్షకు అంగీకరించాలని సుప్రీం కేంద్రానికి చెప్పగా, చివరకు కేంద్రం తలొంచాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హారీశ్ రావత్ సర్కారు బల పరీక్షకు చేసుకోనేందుకు సిద్ధమైంది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఈ బలపరీక్ష జరగనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment