తాజా వార్తలు

Wednesday, 25 May 2016

జూన్‌ 27లోపు తరలింపు పూర్తి కావాలి…

అమరావతికి తరలివెళ్లడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. జూన్ 27 లోపు తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్న సర్కార్… హెచ్‌వోడీలు… డైరెక్టరెట్‌లు ఆఫీసులను ఎంపిక చేసుకోవాలని అదేశాలు జారీ చేసింది. జూన్ 27 లోపు తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోంది.
హైదరబాద్‌లోని ఏపీ ప్రభుత్వ కార్యలయాలతో పాటు సచివాలయాన్ని అమరావతికి జూన్ 27 లోపు తరలించాలని సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తరలింపు ప్రక్రియపై అవసరమైన చర్యలను మొదలు పెట్టింది. సచివాలయం కోసం వెలగపూడిలో నిర్మాణాలు కోనసాగుతుండగా హెచ్‌వోడీల తోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన ఆఫీస్ స్పేస్ ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టాలని సంబంధిత అధికారులను అదేశించింది. గుంటూరు … కృష్ణా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే వినియెగించుకోవాలని… లేకపోతే ప్రైవేటు బిల్డింగ్‌లను ఎంపిక చేసుకోని అగ్రిమెంట్ చేసుకోవాలని అదేశాలు జారీ చేసింది.
తరలింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ 16 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను గుర్తించారు. పార్కింగ్ కోసం మరో 2 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక గుంటూరు కలెక్టర్ లక్షన్నర చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను గుర్తించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జూన్ మొదటి వారంలోపు బిల్డింగ్ ను ఎంపిక చేసుకుని… జూన్ రెండో వారంలో అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం అదేశాలు పంపినట్టు తెలుస్తోంది. ఒక వేళ సంబంధిత శాఖ రాజధాని ప్రాంతంలో బిల్డింగ్ నిర్మిస్తున్నట్టయితే షార్ట్ పిరియాడ్ అగ్రిమెంట్ కు వెళ్లాలని జీఏడీ అదేశాల్లో స్పష్టం చేసింది. బిల్డింగ్ ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్‌ కార్యాలయాల్లో ఉన్న ఫర్నిచర్‌తో పాటు ఇతర సామాగ్రి అంతా రాజధానికి తరలించాలని సూచించింది.
జూన్ 27 లోపు తరలింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యకలపాలు నిర్వహించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment