తాజా వార్తలు

Friday, 6 May 2016

త్వరలో మేమిద్దం కలిసి నటిస్తాం…

కోలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ లలో ఒకరైన సూర్య, జ్యోతిక మళ్లీ కలిసి నటించనున్నారు. పెళ్లి అయిపోయిన తరువాత చాలా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఈ మధ్య ’36 వయదినిలే’ సినిమా తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక అప్పటి నుండి చాలా మంది అభిమానులు జ్యోతిక, సూర్య మళ్లీ కలిసి నటించాలని కోరారు. దీనిపై స్పందించిన సూర్య త్వరలో తాము కలిసి నటించనున్నట్లు తెలిపారు.
తాను, జ్యోతిక త్వరలోనే స్క్రీన్ షేర్ చేసుకోనున్నామని, అందుకు తగిన కథ కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాడు. అలాగే ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించనున్నట్లు చెప్పాడు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో ‘నువ్వు నేను ప్రేమ’, ‘జూన్ 7’, ‘కాఖ కాఖ’, ‘పోవెల్లమ్ కెట్టుప్పర్’, ‘హీరోవా? జీరోవా?’, ‘పెరళగన్’, ‘మాయావి’, ‘ఉయిరిలే కలంతతు’ సినిమాలు వచ్చాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment