తాజా వార్తలు

Saturday, 28 May 2016

ప్రపంచంలో రెండో స్థానంలో ‘కబాలి’…

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ టీజర్ రికార్డ్ ల మోత మోగిస్తోంది. విడుదలైన కొన్ని గంటలల్లోనే ఇండియాలో ఎక్కువ మంది చూసిన టీజర్ గా రికార్డు క్రియేట్ చేయగా.., ఆ తరువాత కొద్ది రోజులకే రెండు కోట్లకు పైగా వ్యూస్ తో ఇండియాలోనే అతి ఎక్కువ మంది వీక్షించిన తొలి సినిమాగా మరో రికార్డును సొంతం చేసుకుంది.
తాజాగా 4 లక్షలకు పైగా లైక్స్ సాధించిన ‘కబాలి’ టీజర్, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ సినిమా ‘ఏవెంజర్స్’ 5.12 లక్షల లైక్స్ తో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉండగా జూన్ 9ల ‘కబాలి’ తొలి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతోంది. మరి ఆ ట్రైలర్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
రజినీకాంత్ మాఫియా డాన్ గా నటించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే ఆయన సరసన హీరోయిన్ గా నటించింది. వరుసగా రెండు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment