తాజా వార్తలు

Saturday, 21 May 2016

మహానాడులో తన్నుకున్న తమ్ముళ్లు…

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ మినీ మహానాడు రసాభాసగా మారింది. మహానాడు సమావేశంలో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం… అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల పోటాపోటీ నినాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గీయులు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.
మహానాడు సమావేశంలో కరణం బలరాం వర్గీయులు జై బలరాం అంటూ నినాదాలు చేయగా… అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు జై గొట్టిపాటి అంటూ ప్రతి నినాదాలు చేశారు. దీంతో మినీమహానాడులో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గీయులు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్నారు. సభాప్రాంగణం నుంచి బయటకు పంపించివేశారు.
కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అద్దంకిలో వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే రవికుమార్ ఇటీవల టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో రవికుమార్‌ చేరికను కరణం వర్గీయులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరునేతలు ఎదురుపడిన ప్రతి సారి స్థానిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment