తాజా వార్తలు

Sunday, 8 May 2016

ముఖ్యమంత్రుల సదస్సుకు వెళ్తున్న కేసీఆర్…

కరువు సాయంపై కేంద్రంతో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు కేసీఆర్‌. రేపు మోడీ అధ్యక్షతన జరిగే ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరయ్యేందుకు ఇవాళ ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు కేసీఆర్‌.
ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న కేసీఆర్‌ రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలలో నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు, తాగు నీటి సమస్యలు, కరవు రక్షణ చర్యలు, తక్కువ నీటితో సేద్యం చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. కరవు నిధులతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురానున్నారు కేసీఆర్‌. అలాగే విభజన హామీలపై కూడా కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేసే అవకాశముంది.
« PREV
NEXT »

No comments

Post a Comment