తాజా వార్తలు

Saturday, 21 May 2016

బీజేపీకి భయపడుతున్న కేసీఆర్

రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి తమ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర నేతలు ప్రకాశ్‌రెడ్డి, కృష్ణసాగర్‌రావుతో కలసి శుక్రవారం ఆయన రాష్ట్ర కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ, పాలేరు ఉప ఎన్నిక ఫలితాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శృతిమించి నోటికొచ్చినట్టుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో తీవ్ర కరువుకాటకాలున్నాయని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలను మరిచి, ఫాంహౌజులో మకాం వేశారని రామచందర్‌రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే కేసులు పెడ్తామని బెదిరించడంద్వారా సీఎం ప్రతిపక్షాలపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ప్రజలకోసం జైలుకు వెళ్లడానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ శ్రేణుల పోరాట శైలిని కేసీఆర్ తెలుసుకుంటే మంచిదని రామచందర్‌రావు హెచ్చరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment