తాజా వార్తలు

Friday, 27 May 2016

స్కామ్‌లపై మోదీ మౌనమెందుకు…!

రెండేళ్ల పాలనలో అన్నివర్గాలను శత్రువులుగా చేసుకోవడమే మోడీ సాధించిన ప్రగతి అంటూ ఎద్దేవా చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మోడీ పాలనపై నిరాశతో ఉన్నారన్నారు. మోడీ కూడా మన్మోహన్ టైపేనని.. ఎలాంటి అవినీతి జరిగినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ లేనంతగా దేశంలో గూండాగిరి ఈ రెండేళ్లలో పెరిగిపోయిందన్నారు కేజ్రీవాల్. వ్యాపం, లలిత్‌ గేట్‌, డీడీసీఏ తదితర కుంభకోణాల విషయంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ తరహాలో మోదీ కూడా మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు కేజ్రీవాల్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment