తాజా వార్తలు

Saturday, 28 May 2016

చీటింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే సతీమణి అరెస్ట్

ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు వసూలు చేసి మోసగించిన కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత గండి బాబ్జీ సతీమణి రిటైర్డ్ డీఎస్పీ కొండపల్లి విజయను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2013లో విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసమున్న సమయంలో కొండపల్లి విజయ విజయవాడకు చెందిన ఎం.గిరీశం రెడ్డి, జి.గోపిరెడ్డి, ఎన్.అప్పనాయుడు, బి.జగన్నాథరావు అనే కూరగాయల వ్యాపారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. అందుకుగాను వారి వద్ద నుంచి రూ.4.08 లక్షలు తీసుకున్నారు.

ఆరు నెలల తరువాత ఆమె సిరిపురంలో ఇళ్లు ఖాళీ చేసి మరో చోటకి వెళ్లిపోయారు. నాటి నుంచి ఆమె ఆచూకీ కోసం బాధితులు గాలించారు. జాడ లేకపోవడంతో అప్పటి పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్‌కు కొండపల్లి విజయపై బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే నాటి నుంచి మొన్నటి వరకు విజయపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్తగా వచ్చిన విశాఖ నగర కమిషనర్ యోగనంద్‌ను బాధితులు శనివారం కలసి... పరిస్థితిని వివరించారు.
దీంతో నగర కమిషనర్ సూచన మేరకు మాజీ డీఎస్పీ విజయపై బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన మూడో పట్టణ సీఐ వెంకటరావు శనివారం చెల్లెలు ఇంట్లో ఉంటున్న మాజీ డీఎస్సీ విజయను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment