తాజా వార్తలు

Thursday, 19 May 2016

యాపిల్ రంగును మార్చేశారు...అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన జెండా రంగులను... ప్రభుత్వ పథకాలతో పాటు బస్సులకు వాడటం మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. అయితే తాజాగా ప్రపంచంలోనే నంబర్ వన్ కార్పొరేట్ కంపెనీ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ లోగో రంగే మారిపోయింది. యాపిల్ కంపెనీ సింబల్ ఇప్పుడు గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది.
హైదరాబాద్ లో ఆ సంస్థ సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ గురువారం టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా బిగ్ న్యూస్ చెబుతానంటూ రెండు రోజుల క్రితం ఊరించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం తన ట్విట్టర్ లో గులాబీ రంగు వేసిన యాపిల్ కంపెనీ సింబల్‌ను ట్వీట్ చేస్తూ ఇదే బిగ్ న్యూస్ అన్నారు.

ప్రస్తుత టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను గచ్చిబౌలిలోని టిస్మన్ స్పియర్ భవనంలో ఏర్పాటు చేశారు. అమెరికా వెలుపల సంస్థకు ఇదే తొలి ఫెసిలిటీ కూడా. దీనికోసం యాపిల్ రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. యాపిల్ మ్యాప్స్ టెక్నాలజీకి కావాల్సిన సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. 2,500 మంది ఉద్యోగులు పని చేయనున్నారు. చదవండి...(కేటీఆర్ చెప్పిన బిగ్‌న్యూస్ ఇదేనా?)

« PREV
NEXT »

No comments

Post a Comment