తాజా వార్తలు

Monday, 23 May 2016

‘మోదీ, బాబు హఠావో… ఆంధ్రాకో బచావో’-కేవీపీ

టీడీపీ, బీజేపీ లాలూచీ వ్యవహారం తెరపైకి రాబోతోందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యడు కేవీపీ. బెజవాడలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్యాకేజీ రాకపోతే… భావి తరాలు నష్టపోతాయన్నారు. మోదీ, బాబు సర్కారును పంపించి… ఆంధ్రను రక్షించాలంటూ నినాదమిచ్చారు కేవీపీ.
‘చంద్రబాబుకో హఠావో… ఆంధ్రాకో బచావో’, ‘మోదీ కో హఠావో… ఆంధ్రాకో బచావో’, ‘టీడీపీ, బీజేపీ హఠావో… ఆంధ్రాకో బచావో’ అంటూ కేవీపీ నినదించారు. ప్రత్యేక హోదా సాధన కోసం భావసారూప్యత గల పార్టీలు, ప్రజాసంఘాలతో పోరాటం చేస్తామన్నారు కేవీపీ.
చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు… ప్రత్యేక హోదాతో తిరిగి వస్తారంటూ లీక్‌లు ఇస్తారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ప్రత్యేక హోదా వస్తే లాభమేంటంటూ మరో లీక్‌ వస్తుందని ఆరోపించారు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే… పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలన్నీ అమలు కాకపోతే… భవిష్యత్‌ తరాలు చాలా నష్టపోతాయన్నారు కేవీపీ
« PREV
NEXT »

No comments

Post a Comment