తాజా వార్తలు

Wednesday, 25 May 2016

హోదాపై బాబుకు కేవీపీ మరోలేఖ…

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంతో పాటు… విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలయ్యేలా కృషి చేయాలని సీఎం చంద్రబాబును కోరారు రాజ్యసభ సభ్యులు కేవీపీ… దాని కోసం బేషజాలకు పోకుండా అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని సూచించారు… ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు పేజీల లేఖ రాశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ.
మహానాడులో స్పెషల్‌ స్టేటస్‌పై రాజకీయం తీర్మానం చేయాలన్నారు కేవీపీ… రెండేళ్లు అవుతున్నా విభజన చట్టంలోని అంశాలు అమలుకాకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్రవేశ పెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును తొక్కిపెట్టారని.. వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఓటింగ్‌ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బిల్లుపై ఏపీలోని పార్టీలు ఏకతాటిపైకి రావాలన్నారు. లోక్‌సభలో పార్టీలకతీతంగా ఎంపీలంతా నిలదీసేలా సీఎం చొరవ తీసుకోవాలని సూచించారు.
బేషాజాలకు పోకుండా అన్నిపార్టీలను కలుపుకుని పోరాడాలని… గొడవలు మర్చిపోయి పొత్తులు పెట్టుకోవడం పార్టీలకు కొత్తేమీ కాదు… ఏపీ అభివృద్దే లక్ష్యంగా మీరు చొరవ తీసుకోవాలని.. అన్ని పార్టీలతో “పరస్పర దూషణ విరమణ’ ఒప్పందం చేసుకుని పోరాడాలని పిలుపునిచ్చారు కేవీపీ. పార్టీలు తాత్కాలికంగా అయినా కలిసి పనిచేస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని పేర్కాన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment