తాజా వార్తలు

Tuesday, 17 May 2016

కోలీవుడ్ పై కన్నేసిన లావణ్య…

బార్బీ గర్ల్ లావణ్య త్రిపాఠికి తెలుగులో బాగానే ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈ అమ్మడి చూపు ఇప్పుడు కోలీవుడ్ పై పడింది. అప్పుడెప్పుడో శశికుమార్ తో ‘బ్రహ్మన్’ అనే తమిళ్ మూవీలో నటించింది లావణ్య. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అక్కడ అవకాశాలు కూడా కరువయ్యాయి. ఇప్పుడు మరోసారి సందీప్ కిషన్ సరసన ‘మాయన్’ అనే తమిళ్ హర్రర్ లో నటిస్తోంది.
దీంతో ఇప్పుడు లావణ్య ఆశలన్నీ ఆ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాకి సీవీ కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఇక మిగిలిన పనులను కూడా కంప్లీట్ చేసుకుని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు మూవీని తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చూద్దాం మరి లావణ్య కు హర్రర్ సినిమా ఏ మేరకు కలిసొస్తుందో…
« PREV
NEXT »

No comments

Post a Comment