తాజా వార్తలు

Thursday, 26 May 2016

లావణ్యకు ఎలాంటి భర్త కావాలంటే…

మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని అడిగితే.., ఇలా ఉండాలి అలా ఉండాలి అని తమ తమ అభిప్రాయాలను చెబుతారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మిస్ ఉత్తరాఖండ్ లావణ్య త్రిపాఠిని అడిగితే.., “జీవితం ఎంత మాత్రం బోర్ కొట్టకుండా, అనుక్షణం తనని సర్ప్రైజ్ చేసే భర్త కావాలని చెప్పింది. అలాంటి వ్యక్తి దొరికితే తాను చాలా అదృష్టంగా ఫీలవుతానని” చెప్పింది.
అలాగే సినిమాల గురించి మాట్లాడతూ ఇప్పటివరకూ తను నటించిన అన్ని సినిమాలు తనకు చాలా తృప్తినిచ్చాయని.., ఇక ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మాయన్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం లావణ్య వరుణ్ తేజ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్టర్’ సినిమాలో నటించనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment