తాజా వార్తలు

Sunday, 29 May 2016

జగన్ కు సవాల్ విసిరిన లోకేష్…

మహానాడు వేదికగా టీడీనీ యువనేత లోకేష్‌, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సవాల్‌ విసిరారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే స్వచ్ఛందంగా జైలుకు వెళ్లి కూర్చుంటనన్నారు. ప్రతిప‌క్ష పార్టీ అభివృద్ది నిరోధక చ‌ర్యల‌పై తీర్మానం ప్రవేశపెట్టిన చినబాబు.., అభివృద్ధికోసం చంద్రబాబు శ్రమిస్తుంటే ప్రతిపక్ష నేత అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 20 నిమిషాలు మాట్లాడిన యువనేత తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో స‌భ్యుని హోదాలో తొలిసారి మ‌హానాడు వేదికపై లోకేష్‌ ప్రసంగించారు. రెవెన్యూ లోటుతో ఇబ్బందిపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తండ్రిని పొగడ్తల్లో ముంచెత్తారు లోకేష్‌. లోక్‌సభ సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక వైసిపి, టిఆర్ఎస్ లు టిడిపి ల‌క్ష్యంగా రాజకీయాలు చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ముఖ్యమంత్రి క‌ష్ట ప‌డుతుంటే, జగన్‌ అన్నింటికీ అడ్డంకులు సృష్టించే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. అంతేకాకుండా జగన్ లాగా తాను తన తండ్రికి చెడ్డ పేరు తీసుకురానని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment