తాజా వార్తలు

Thursday, 26 May 2016

సుదీప్, భూమిక ప్రధాన పాత్రలలో ‘లవ్ యు అలియా’…

భూమిక, సుదీప్‌, సన్ని లియోన్‌ స్పెషల్ పాత్రలో చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌ జంటగా నటించిన ‘లవ్‌ యు అలియా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ మాట్లాడుతూ – ”అందర్నీ ఆకట్టుకునే చక్కని ప్రేమ కథా చిత్రమిది. ఈ చిత్రంలో భూమిక, కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌, గ్లామర్‌స్టార్‌ సన్నీ లియోన్‌ ప్రత్యేక పాత్రలు పోషించారు. ఈ నెలాఖరులో ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి జూన్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. ఈ సినిమాను జెస్సీ గిఫ్ట్ సంగీతాన్ని అందించాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment