తాజా వార్తలు

Sunday, 29 May 2016

‘ఒక్క అమ్మాయి తప్ప’ టీమ్ కు మహేష్ విషెస్…

సందీప్‌ కిష‌న్‌, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు అందించారు. టక్కరి దొంగ సినిమా రోజుల నుండి దర్శకులు రాజసింహ కు మహేష్ బాబు తో మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు కు చూపించారు. ఈ సందర్భంగా చిత్రం కథ గురించి, కథనం గురించి అడిగి తెలుసుకున్న మహేష్ బాబు, రాజసింహ చూపించిన ట్రైలర్ ను చూసి మెచ్చుకున్నారు. చిత్రంలోని గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగుంది అని అభినందించారు.
దీనిపై దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ “నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను . ఇటీవలే మహేష్ బాబు గారిని కలిసి ట్రైలర్ ను చూపించాను. ఆయనకు ట్రైలర్ ఎంతగానో నచ్చిందని” అన్నారు. ఇక మిక్కీ జే మేయర్ అందించిన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయని, ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 10న సినిమాను రిలీజ్ చేస్తామని” తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment