తాజా వార్తలు

Saturday, 21 May 2016

వైవిధ్యమైన కథతో ‘మనమంతా’…

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రలలో నటించిన ‘మనమంతా’ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. వైవిధ్య దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఒక కొత్త కథతో తెరకెక్కుతోంది. నలుగురు వ్యక్తుల జీవితాల్లో చోటుచేసుకున్న పరిస్థితులు, వాళ్ల జీవితాల్లోని అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా ఉన్నట్లు సమాచారం.
తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించాడు. మహేష్ శంకర్ సంగీతాన్ని అందించాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment