తాజా వార్తలు

Saturday, 7 May 2016

మరో అంతర్జాతీయ చిత్రంలో మంచు లక్ష్మీ…

మంచు ల‌క్ష్మి ఇప్పటికే ‘లాస్ వేగాస్’, ‘ఈఆర్’, ‘డెస్పరేట్ హౌస్ వైఫ్’ లాంటి టెలివిజ‌న్ సీరియ‌ల్స్ తో పాటు, పలు హాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు టాలీవుడ్ లో బిజీ అయిన మంచు లక్ష్మీ చాలా రోజుల త‌ర్వాత మరోసారి హాలీవుడ్ నిర్మాణ సంస్థలో నటించింది. ఈ సినిమా పేరు ‘బాస్మతి బ్లూస్’. కథానుగుణంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇండియాలోనే జ‌రిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో బ్రీ లార్సన్ , డోనాల్డ్ సతర్లాండ్ , స్కాట్ బకుల ముఖ్య పాత్రల్లో నటించారు. డాన్ బారోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మేనిక్యూ కాల్ ఫీల్డ్ నిర్మించాడు. ఒక సైంటిస్ట్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. తాను సృష్టించిన కొత్త వరివంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చే ఓ శాస్త్రవేత్త ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? మధ్యలో అతని జీవితం,ప్రేమ‌ ఎలాంటి మలుపులు తిరిగాయ‌నే అంశాల‌తో ఈ సినిమా రూపొందిందినట్లు సమాచారం
« PREV
NEXT »

No comments

Post a Comment