తాజా వార్తలు

Friday, 13 May 2016

కుమారుడి కోసం బెయిల్ అప్లై చేసిన మనోరమ…

వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో యువకుడిని కాల్చి చంపినందుకు బీహార్ ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు రాకీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమెపై మరిన్ని ఆరోపణలతో సీఎం నితీష్ కుమార్ మనోరమను సస్పెండ్ చేశారు. దాంతో అరెస్ట్ భయంతో రెండు రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది మనోరమ.

అయితే ఇప్పుడు కుమారుడు రాకీ యాదవ్ కోసం యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించడం కోసం బయటకు వచ్చింది. మరోవైపు మనోరమను వెంటనే అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మనోరమ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. దీన్ని సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment