తాజా వార్తలు

Tuesday, 31 May 2016

విశాఖ పోలీసుల అదుపులో మావోయిస్టులు

పలువురు మావోయిస్టులను విశాఖపట్నం జిల్లా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రహస్య ప్రదేశం విచారిస్తున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిని మావోయిస్టుల్లో ఇద్దరు దళ కమాండర్లు కాగా... మరొకరు దళ సభ్యుడుతో మిలీషియా సభ్యులు కూడా ఉన్నారు. అదుపులోకి తీసుకున్న దళ కమాండర్లపై రూ. 4 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. దళ సభ్యుడిపై రూ.లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. సదరు మావోయిస్టులను ఈ రోజు ఉదయం 11.30 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment