తాజా వార్తలు

Friday, 27 May 2016

77,830 కార్లను వెనక్కి పిలిచిన మారుతి…

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి మార్కెట్ నుంచి 77,830 కార్లను వెనక్కి పిలిపిస్తుంది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ సాప్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు 75,419 మారుతి సుజుకి బాలెనో కార్లను వెనక్కి రప్పిస్తుంది. అదేవిధంగా ఫ్యూయల్ ఫిల్టర్‌ను మార్పు చేసేందుకు 1,961 స్విఫ్ట్ డిజైర్ కార్లను కూడా రీకాల్ చేసింది మారుతి.
 2015 ఆగస్టు 3 నుంచి 2016 మే 17 వరకు తయారుచేసిన పెట్రోల్‌, డీజిల్‌ రెండు వెర్షన్ల కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు సుజుకి తెలిపింది. ఈ సమయంలో తయారుచేసిన 16వేల డీజిల్‌ బాలెనో కార్లలో ఫ్యుయల్‌ ఫిల్టర్‌ కూడా సరిచేయనున్నట్లు తెలిపింది. వెనక్కి పిలిచే కార్లకు సంబంధించి కంపెనీనే కస్టమర్లను మే 31 నుంచి సంప్రదిస్తుందని ప్రకటనలో తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment