తాజా వార్తలు

Friday, 6 May 2016

సూర్యుడిని దాటనున్న బుధగ్రహం…

ఈ నెల 9న బుధగ్రహం సూర్యుడ్ని దాటనుందని శాస్ర్తవేత్తలు తెలిపారు. ఈ అద్భుతం దశాబ్ధంలో మూడు సార్లు మాత్రమే వస్తుందని వెల్లడించారు. అయితే ఈ ఘటనను నేరుగా వీక్షించరాదని, కళ్లజోళ్లతో వీక్షించాలని సూచించారు. ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ అద్భుతం సూర్యోదయం సమయంలో సంభవిస్తే.., భారత్ లో మాత్రం సాయంత్రం 4:15 నుంచి 6:20 నిమిషాల మధ్య ఈ దృశ్యం కనిపించనుందని అన్నారు.
కానీ ఎలా పడితే అలా చూస్తే ఇది కనిపించే అవకాశాలు తక్కువని తెలిపారు. కనిపించినా చిన్న తోకచుక్కవలె కనిపిస్తుందని పేర్కొన్నారు. అందుకే దీనిని వీక్షించేందుకు చెన్నైలోని బిర్లాప్లానెటోరియంలో నాలుగు టెలిస్కోప్ లు ఏర్పాటు చేశారు. 1999 లో, 2003లో, 2006లో చోటుచేసుకున్న ఈ ఘటన ఈ నెల 9న పునర్దర్శనం కానుంది. మళ్లీ ఓ పదేళ్ల తరువాత ఈ అద్భుతం వీక్షించే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment