తాజా వార్తలు

Wednesday, 25 May 2016

ముద్రగడ భాష అభ్యంతరకరం…

కాపు రిజర్వేషన్లకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు… ఆ దిశగానే ఓ కమిషన్‌ వేసి ముందుకు వెళ్తునామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముద్రగడ పద్మనాభం లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గంటా.
ముద్రగ‌డ ప్రభుత్వాన్ని విమ‌ర్శిస్తూ మాట్లాడే భాష అభ్యంత‌ర‌క‌రంగా ఉందన్నారు గంటా. మిగతా వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని సూచించారు. మంచి మెజార్టీతో టీడీపీని గెలిపించిన కాపుల రుణం తీర్చుకుంటామన్నారు గంటా. కాపుల‌ను బీసీల్లో చేర్చేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నామన్నారు.
ముద్రగడ పద్మనాభం రాజకీయ ఉనికికోసం కాపులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని… కొందరి చేతుల్లో ముద్రగడ కీలుబొమ్మగా మారిపోయారని గంటా ఆరోపించారు. కాపులకు శాశ్వతంగా నష్టం జరిగేలా ముద్రగడ వ్యవహరిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. కాపు జాతికి మీరే ప్రతినిధిగా మాట్లాడొద్దని విమ‌ర్శించారు. ద‌య చేసి ఎవ‌రో రాసిచ్చిన లేఖ‌ల‌ను మాకు పంపొద్దని కోరుతున్నామన్నారు మంత్రి గంటా.
« PREV
NEXT »

No comments

Post a Comment