తాజా వార్తలు

Monday, 30 May 2016

ముద్రగడ ఒక్కరే కాపులకు నేత కాదు…

కాపులకు ముద్రగడ ఒక్కరే నాయకుడు కాదని… జిల్లాకో నేత ఉన్నాడన్నారు మంత్రి నారాయణ. కాపులకు వ్యతిరేకంగా చంద్రబాబు గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లారన్న ముద్రగడ… అప్పుడు టీడీపీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. వైఎస్‌ దేవుడనే ముద్రగడ… కాంగ్రెస్‌ 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.
ముద్రగడ రాజకీయ లబ్ధి కోసమే కాపులను రెచ్చగొడుతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. కాపులను చట్ట ప్రకారం బీసీల్లో చేర్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని… అందుకు కమిషన్‌ కూడా నియమించారని తెలిపారు మంత్రి నారాయణ.
« PREV
NEXT »

No comments

Post a Comment