తాజా వార్తలు

Friday, 27 May 2016

నాటా వేడుకలకు హాజరైన మిథున్ రెడ్డి

వైయస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అమెరికా నాటా వేడుకలకు హాజరయ్యారు.  ప్ర‌తి సంవ‌త్స‌రం అమెరికాలో నిర్వ‌హించే నాటా వేడుకల‌్లో భాగంగా....అక్క‌డున్న తెలుగు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు  మిథున్ రెడ్డిని ఆహ్వానించారు. ఈసందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ...అమెరికాలో తెలుగువారందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. 

ఈ స‌భ‌ల‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కూడా ఆహ్వానించార‌ని,  కానీ రాష్ట్రంలో ఉన్న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తీరిక లేకుండా పోరాడుతున్నందు వ‌ల్ల ఆయ‌న హాజ‌రు కాలేక‌పోయార‌ని వివ‌రించారు. వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌రిగే నాటా వేడుక‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌ప్ప‌కుండా హ‌జ‌ర‌వుతాన‌ని హామీ ఇచ్చార‌ని... అదే మాట‌ను ఇక్క‌డున్న వారికి తెలియ‌జేస్తాన‌ని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. 

అమెరికాలో వేల‌ాది మంది తెలుగువారు ఉండ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని  ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారి సహకారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బ‌లోపేతం చేయ‌డానికి కృషి చేస్తామని మిథున్ రెడ్డి తెలిపారు . వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎంతోమంది అమెరికాలో ఉన్న‌త హోదాలో ఉన్నార‌ని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment