తాజా వార్తలు

Monday, 16 May 2016

దమ్ముంటే రాజీనామా చేసి గెలువు

తన సోదరుడు, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టమేమి జరగదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఆదివారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సోదరుడిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘ మేం గెలిపిస్తే నీవు ఎమ్మెల్యే అయ్యావ్.. లేకుంటే నీకు ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది.. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో’ అని పేర్కొన్నారు.

తమ తండ్రి నర్సిరెడ్డి ఆశయ సాధనకు పార్టీ మారానని చెప్పుకోవడం సిగ్గుచేటని, వచ్చే ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగరాలే.. కార్యకర్తలు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment