తాజా వార్తలు

Monday, 30 May 2016

కోవర్టులే మహానాడుకు వెళ్లారు-కర్నె

మహానాడుకు హాజరైన తెలంగాణ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్రె ప్రభాకర్‌. తెలంగాణలో ఉన్న ఆంధ్ర కోవర్టులంతా టీడీపీ మహానాడకు హాజరయ్యారన్న కర్రె… టి.టీడీపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర నేతల ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 12 లక్షల మంది వలసలు పోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు కర్నె ప్రభాకర్‌. తెలంగాణ టీడీపీ నేతలు… తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారో… ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారో… తేల్చుకోవాలన్నారు కర్నె ప్రభాకర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment