తాజా వార్తలు

Saturday, 7 May 2016

రేపు ముంబయి ఇండియన్స్ vs సన్ రైజర్స్… విశాఖలో భారీ భద్రత ఏర్పాట్లు…

ఐపీఎల్-9లో భాగంగా ముంబయి ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ మ‌ధ్య విశాఖ‌పట్టణంలో ఆదివారం జరగనున్న క్రికెట్ మ్యాచ్‌కు స‌ర్వం సిద్ధం చేశారు అధికారులు. విశాఖ‌లోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మ్యాచ్ దృష్ట్యా పోలీసులు అక్కడి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వద్ద 1000 మంది పోలీసులతో గ‌ట్టి భ‌ద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలతో అక్కడి ఎండాడ జంక్షన్ వరకే వాహనాల రాకపోకలను అనుమ‌తించ‌నున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్కడ జ‌రిగే అన్ని మ్యాచులకు ఈ ఆంక్షలు వ‌ర్తిస్తాయ‌ని.., మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు నుండి స్టేడియంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment