తాజా వార్తలు

Saturday, 14 May 2016

కాంగ్రెస్ వైపు నాగం చూపు…?

ప్రస్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉన్న తెలంగాణ నేత నాగం జ‌నార్దన్ రెడ్డి త్వర‌లో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. ఈ మేర‌కు ఆయన రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. బీజేపీ అధిష్ఠానం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. భ‌విష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బ‌ల‌మైన రాజ‌కీయ వేదికగా ఉంటుందని ఓ సందర్భంలో ఆయ‌న వ్యాఖ్యానించారు.
తన రాజకీయ కెరీర్ ను టీడీపీతో స్టార్ట్ చేసిన నాగం ఆ తరువాత ఆ పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించడంతో బహిష్కరణకు గుర‌య్యారు. ఆ తరువాత ‘తెలంగాణ నగర సమితి’ అనే పార్టీని స్థాపించి కొన్ని రోజుల తరువాత తన పార్టీని భార‌తీయ జ‌న‌తా పార్టీలో విలీనం చేశాడు. ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం తీరుపై కూడా అలిగిన నాగం జనార్దన్ రెడ్డి ఇక హ‌స్తం పార్టీ కండువా క‌ప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment