తాజా వార్తలు

Wednesday, 25 May 2016

రాజ్యసభపై తెలంగాణ నేతలు ఆశలు పెట్టుకోవద్దు…!

రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా అందరి ఫోకస్‌ ఇప్పుడు రాజ్యసభపై పడింది… రాజ్యసభ సీటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కొందరు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఏపీ టీడీపీ కోటాలో రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. పార్టీ అధినేతకు విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు.
మరోవైపు రాజ్యసభ సీటు వస్తుందని భావిస్తున్న తెలంగాణ నేతల ఆశలపై నీళ్లు చల్లారు నారా లోకేష్‌… ఏపీ కోటా రాజ్యసభ సీటును తెలంగాణ నేతలకు కేటాయించే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఏపీలోనే రాజ్యసభకు బలమైన ఆశావహులున్నారని చెప్పుకొచ్చారు.
రాజ్యసభ సీటుపై బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు టీడీపీ నేత నారా లోకేష్‌… అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు లోకేష్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment