తాజా వార్తలు

Friday, 6 May 2016

కొత్త జిల్లాలపై కసరత్తులు…

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసింది ప్రభుత్వం. ఇప్పుడున్న పది జిల్లాల్ని 24 లేదా 25 జిల్లాలుగా విభజించాలని ప్రణాళికలు వేశారు. జూన్‌ రెండు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం నాడు ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడుతుంది. ఆగస్ట్‌ 15 లేదా దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని అధికారంలోకి రాగానే ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఎట్టకేలకు ఆ కసరత్తును కొలిక్కి తీసుకువచ్చారు. జిల్లాల పెంపుదలకు అనుగుణంగా మరో 40 కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆరు నుంచి పది మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించబోతోంది ప్రభుత్వం.
« PREV
NEXT »

No comments

Post a Comment