తాజా వార్తలు

Monday, 23 May 2016

వియత్నాంలో బిజీబిజీగా ఒబామా…

రెండు రోజుల పర్యటనకు వియాత్నం వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ఒబామా బిజీ బిజీగా గడుపుతున్నారు. సోమవారం వియాత్నం ప్రెసిడెంట్‌తో చర్చించిన ఆయన ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. వియత్నాం ప్రధానితో, కమ్యూనిస్ట్‌ పార్టీ నేతలతోనూ చర్చలు జరిపారు.
ఇవాళ యూఎస్‌ ఎంబసీ స్టాఫ్ తో సమావేశం అవుతారు. అనంతరం మెంబర్స్ ఆఫ్‌ సివిల్‌ సొసైటీతో భేటీ అవుతారు. ఆ తర్వాత రాజధాని హోనోయ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హో-చీ-మిన్హ్‌ నగరంలోని జాడే ఎంపరర్‌ పగోడా పింక్‌ కలర్‌ టెంపుల్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత డ్రీమ్‌ఫ్లెక్స్‌ స్పెస్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడే పలు వ్యాపార చర్చలు జరుపుతారు. టూర్‌ ప్రధాన లక్ష్యం దక్షిణ చైనా సముద్ర వివాదమే అయినా, ఇంకా ఎన్నో అంశాలు పర్యటనలో మిళితమై ఉన్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment