తాజా వార్తలు

Monday, 16 May 2016

ట్రంప్ ను హెచ్చరించిన ఒబామా…

రిపబ్లికన్‌ అభ్యర్ధి ట్రంప్‌కు పరోక్షంగా హెచ్చరించారు అమెరికా ప్రెసిడెంట్ ఒబామా. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన ట్రంప్ ను ఉద్దేశించి తెలిపారు. న్యూ జెర్సీ లోని రగ్గర్స్‌ యూనివర్సిటీ 250 వార్షికోత్సవానికి ఒబామా హాజరయ్యారు. వర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా ట్రంప్ ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 250 ఏళ్ల చరిత్ర ఉన్న రగ్గర్స్ యూనివర్సిటీకి అమెరికా ప్రెసిడెంట్‌ రావడం ఇదే తొలిసారి.
« PREV
NEXT »

No comments

Post a Comment