తాజా వార్తలు

Thursday, 26 May 2016

పోటీ లేకుండా వస్తున్న మెగా ప్రిన్సెస్…

నాగశౌర్య, నిహారిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఒక మనసు’ సినిమా విడుదల తేదిని ఖరారు చేశారు. జూన్ 24న ఈ సినిమా విడుదల కానుంది. అంతేకాదు ఆ రోజు సోలాగా ఈ సినిమా బరిలోకి దిగనుంది. మామూలుగా జూన్ 10న విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ ఆ రోజు రెండు సినిమాలు ఉండటం, తరువాత వారంలో నాని బరిలో ఉండటంతో 24న విడుదల తేదిని కన్ఫార్మ్ చేశారు.
‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ ఫేమ్ రామ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఆడియో కూడా మంచి రెస్ఫాన్స్ ను తెచ్చుకుంది. మధుర శ్రీధర్, tv9 సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment