తాజా వార్తలు

Thursday, 5 May 2016

పవన్ ఆదుకోవాలంటున్న తాడేపల్లి రైతులు…

రాజధాని రైతులు మళ్లీ నిరసన గళం విప్పారు. పవన్ కళ్యాణ్ త‌మ‌ను ఆదుకోవాలంటూ తాడేప‌ల్లిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్లీల‌ను వేయించారు రైతులు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం భూసేక‌ర‌ణ ప్రక్రియ‌ను తాము వ్యతిరేకిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. రాజ‌ధాని ప‌రిధి నుంచి పెనుమాక‌, ఉండ‌వ‌ల్లి భూముల‌ను ప‌వ‌న్ క‌ల్యాణే త‌ప్పించాలని కోరుతున్నారు. త‌మ‌ను ఆదుకుంటామ‌ని గ‌తంలో ప‌వ‌న్ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. రాజధాని కోసం త‌మ భూముల‌ను కోల్పోయేందుకు ఒప్పుకోమ‌ని చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment