తాజా వార్తలు

Friday, 13 May 2016

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రఘువీరా ఫైర్…

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా.., కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి. కరువు బాధితులను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. గత మూడేళ్ళలలో ప్రభుత్వం కరువు బాధితులను గాని,తుఫాన్ల వల్ల నష్టపోయిన బాదితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు.

రాష్ట్రంలోని సగం ప్రాంతం ఏడారిగా మారనున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. అలాగే తెలంగాణా ప్రభుత్వం అక్రమంగా గోదావరి,కృష్ణా నదులపై ప్రోజెక్ట్ లను నిర్మిస్తున్నా ప్రభుత్వం గుడ్లప్పంగించి చూస్తుందన్నారు. కరువు బాధితులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ద్వారా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నామన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment