తాజా వార్తలు

Wednesday, 18 May 2016

పోరాడే ముఖ్యమంత్రి కావాలి: రఘువీరా

ఆంధ్రప్రదేశ్‌కు అడుక్కునే ముఖ్యమంత్రి కాదు..పోరాడే ముఖ్యమంత్రి కావాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉందని ఆయన తెలిపారు. అక్రమ ప్రాజెక్టులపై ప్రధాన మంత్రి మోదీ వద్ద చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై మాట్లాడేందుకు కేసీఆర్‌ను చూసి ఆయన భయపడుతున్నారా అని అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గత పదిహేను రోజుల నుంచి కనిపించకుండాపోయారని ఎద్దేవా చేశారు. 2019లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే ఏపీకి ప్రత్యేక హోదాపైనే మొదటి సంతకం చేస్తారని చెప్పుకొచ్చారు.
 
« PREV
NEXT »

No comments

Post a Comment